మేడారంలో సరస మైన ధరలకు రూములు అద్దెకు ఇవ్వబడును

నవతెలంగాణ- తాడ్వాయి 
మేడారం మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో హరిత హోటల్ ఎదురుంగా “మేడారం టెన్ట్ సిటీ” ఆధ్వర్యంలో సరసమైన ధరలకు సకల సౌకర్యాలతో టెంట్ రూమ్స్ ఇవ్వబడును. వీటిని శుక్రవారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క పూజారి కుక్కెర రమేష్ లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడారం టెంట్ సిటీ నిర్వాహకులు మాట్లాడుతూ స్థానికంగా దొరికే రూముల కంటే సరసమైన ధరలకు అన్ని సౌకర్యాలతో టెంట్ రూమ్స్ అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చిన వారు స్వేద తీర్చుకోవడానికి (అన్ని)సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.