రోజ్ గార్ ఆధారిత్ జనకళ్యాణ్ జాతీయ ఫోర్టల్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్,  “రోజ్‌గార్ అధారిత్ జనకళ్యాణ్” జాతీయ పోర్టల్‌ను ప్రధాని మంత్రి బుధవారం   ప్రారంభించి,  వెనుకబడిన వర్గాల నుండి లక్ష మంది పారిశ్రామికవేత్తలకు రుణ సహాయాన్ని ఆమోదించినట్లు లీడ్ బ్యాంకు  మేనేజర్ తెలిపారు.  ఈ సందర్భంగా, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు,  పారిశుధ్య కార్మికులతో సహా అట్టడుగు వర్గాలను లక్ష్యంగా చేసుకుని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వ నిబద్ధతను ఎత్తిచూపుతూ ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పోర్టల్ అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (నమస్తే ) కింద మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు ఆయుష్మాన్ హెల్త్ కార్డ్‌లు, కిట్‌లను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేసారు. “ఈ చొరవ సవాలుతో కూడిన పరిస్థితుల్లో పనిచేసే ఫ్రంట్‌లైన్ కార్మికుల ఆరోగ్యం, భద్రతను కాపాడే దిశగా మరో అడుగును సూచిస్తుంది” అని అయన  పేర్కొన్నారు.  దేశంలోని అణగారిన వర్గాలకు చెందిన లక్షలాది మంది వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, లీడ్ జిల్లా మేనేజర్ శివరామకృష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ కుమారి, పవన్ కీర్తి,హోమ్  వ్యవహారాల శాఖ అధికారి అభిజిత్ శర్మ, శ్రీనిధి ఆర్ఎం  రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, వివిధ మండలాల మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్లు, శ్రీనిధి లబ్ధిదారులు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.