నవతెలంగాణ – తుంగతుర్తి
గులాబీ కంచుకోటగా తుంగతుర్తి నియోజకవర్గం, హ్యాట్రిక్ విజయంతో పాటు క్యాబినెట్ మంత్రి పదవి ఖాయమంటున్న అభిమానులు కార్యకర్తలు. డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఇప్పటికే రెండుసార్లు ఏకధాటిగా గెలుపొంది ముచ్చటగా మూడోసారి తుంగతుర్తి గడ్డపై గులాబీ జెండాను ఎగరేసి గులాబీ కంచుకోటగా మారుస్తున్న గాదరి కిషోర్ కుమార్ కు మంత్రి పదవి ఖాయమని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్త …దళితుడు కావడంతో అవకాశాలు మెండుగా ఉన్నాయని, కమ్యూనిస్టుల కంచుకోట తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని గులాబీ కోటగా మార్చిన ఘనత కిషోర్ కుమార్ దే అంటున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో కిషోర్ కు అత్యంత దగ్గర సంబంధాలు ఉండడం మూలంగా మంత్రి పదవి లభిస్తుందని ముక్తకంఠంతో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గాదరి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. త్వరలోనే తుంగతుర్తి నియోజకవర్గం యొక్క రూపు రేఖలు మారడంతో పాటు అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండడం ఖాయమని నియోజకవర్గ ప్రజల మాట.