– మంత్రులు కేటీఆర్, హరీష్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చేసిన పోరాటాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన సారథ్యంలో రాష్ట్రంలో గత పదేండ్లలో జరిగిన అభివృద్ధిని పాట రూపంలో కళ్ళకు కట్టినట్టు చూపించే ‘గులాబీల జెండలే రామక్క’ అనే పాటను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శుక్రవారం ప్రగతి భవన్‌లో విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉందని పాట పాడిన నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం, తాండ్ర గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయలను వారు అభినందించారు. తమ గానంతో ఆకట్టుకున్న కొమ్ము లక్షమ్మ బృందానికి మంత్రి కేటీఆర్ పోచంపల్లి చీరలను బహూకరించి సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజరు ఇతర నాయకులు పాల్గొన్నారు.