రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష పే చర్చ అవగాహన సదస్సు

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
స్థానిక బస్టాండ్ దగ్గర గల ఆదర్శ్ హిందీ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం పదవ తరగతి విద్యార్థులపై పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రీత్యా పరీక్ష పే చర్చ సారాంశంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు క్లబ్ ఇన్చార్జి అధ్యక్షుడు జి రామకృష్ణ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థి దశనుండే జీవనంలో స్థిరపడాలని ఆలోచన లక్ష్యాలను ఏర్పరచుకొని దానికి తగిన విధంగా దశాభిశలను అధ్యాపకుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. తదనంతరం కార్యక్రమానికి విచ్చేసిన నిరుపమ్ ఫ్యూచర్ మైండ్ అధినేత ప్రముఖ ట్రైనర్ రాచకొండ చంద్రశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పదవ తరగతి పరీక్షలు జీవితంలో స్థిరపడాడనికే ఒక వారధి లాంటిదని ఈ పరీక్షలలో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచి జీవనంలో ఉన్నతంగా స్థిరపడాలని కోరారు. దీనికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న నలభై రోజులను ఏ విధంగా ఉపయోగించుకోవాలని అంశాల్ని వివరిస్తూ విద్యార్థులు చక్కటి పౌష్టికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పటివరకు ఉపాధ్యాయులు బోధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా రివిజన్ చేస్తూ ముందుకు వెళ్లాలని విద్యార్థి తలుచుకుంటే విజయం తమదేనని అన్నారు. వివిధ సబ్జెక్టులలో పట్టు ఎలా సాధించాలో విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించడం జరిగినది. తదనంతరం గౌరవనీయులు పెద్దలు అయినటువంటి రోటరీ క్లబ్ సభ్యులు రాజస్థానీ శిక్ష సమితి సభ్యులు ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ సంతకాల సేకరణ చేయడం జరిగినది. కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, శ్రీరాంసోని, శ్రీకాంత్ జవహర్, డాక్టర్ కొండ అమర్నాథ్, జుగల్ సోనీ, సుధీర్ గుప్తా, పాఠశాల హెచ్ఎం ఆనంద్ ఉపాధ్యాయ, సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.