
– ఐదుగురు విద్యార్థులకు సైకిళ్ళు అందజేత
నవతెలంగాణ పెద్దవంగర: రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సేవలు ఆదర్శనీయమని ప్రధానోపాధ్యాయురాలు లీల శోభారాణి అన్నారు. బొమ్మకల్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు క్లబ్ అధ్యక్షుడు కురువెల్ల రాజా గోపాల్, కార్యదర్శి గంట వేణుగోపాల్ సహకారంతో సైకిళ్ల ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గత ఏడాది కూడా రోటరీ క్లబ్ వారు ఉచితంగా పాఠశాల విద్యార్థులకు ఐదు సైకిళ్ళు పంపిణీ చేశారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల సౌకర్యార్థం దాతలు సహకారం అందించడం ప్రశంసానీయమన్నారు. దాతల సహకారాన్ని సద్వినియోగం చూసుకుని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలన్నారు. సైకిళ్ళు పంపిణీకి చొరవ చూపిన పాఠశాల ఉపాధ్యాయుడు భాస్కర్ ను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్, రవీందర్, రమేష్ బాబు, ప్రవీణ్, విద్యార్థులు పాల్గొన్నారు.