స్థానిక బర్కత్పురా నందుగల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రోటరీ వోకేషనల్ సర్వీస్ ఎక్స్ల్లెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు బిరెల్లి విజయరావ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోటరీ జిల్లా 3150 డిప్యూటీ గవర్నర్ ఆకుల అశోక్ హాజీరై కార్యక్రమానీ ఉద్దేశించి మాట్లాడుతూ.. రోటరీ అంతర్జాతీయ సంస్థ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో రోటరీ ఒకేషనల్ సర్వీస్ ఎక్స్ల్లెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అంతర్రాష్ట్ర స్థాయిలో ప్రతి క్లబ్బులు నిర్వహిస్తుందని దీనిలో భాగంగానే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవార్డులను అందుకుంటున్నటువంటి ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రోటరీ క్లబ్ సభ్యులు , నవ్య భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ ఖ్యతం సంతోష్ కుమార్, చింతకుంట అనాధ వృద్ధాశ్రమం బృందానికి, ప్రముఖ యువ బాలిక పైలట్ కుష్బూ సాబు లకు అవార్డ్స్ లని అందజేయడం అభినందనీయం అన్నారు. ఈ అవార్డ్స్ ద్వారా అవార్డు గ్రహీతలకు ప్రోత్సాహం లభించి వారి వారి కార్యాచరణలో మరింత రనిస్తారాని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యక్రమా డైరెక్టర్ శ్రీకాంత్ జవహర్, సభ్యులు ఇంగు రాజేశ్వర్, జ్ఞాన ప్రకాష్, రాజ్కుమార్ సుబేదార్, పార్సి రాజేశ్వర్, శ్యామగర్వాల్, జి. రామకృష్ణ, తులసీదాస్పటల్, బాబు రావ్, ధన్పల్ శ్రీనివాస్, గోవింద్ జవహర్, జుగల్ సోనీ, సాగర్ మలాని, సుధీర్ గుప్తా, నర్సింగరావు, శ్రీనివాసరావు, తదితర సభ్యులు పాల్గొన్నారు.