నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ జనవరి 26 నుండి 28 వరకు మీ సుదీర్ఘ వారాంతపు విహారయాత్రను సమున్నతం చేయడానికి సిద్ధమైంది. వినోద ఉద్యానవనాల ఉత్సాహ పూరిత శక్తితో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని జరుపుకుంటున్న వేళ థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లో మునిగిపోండి. ప్రతి టిక్కెట్ నూ రూ.999 (GSTతో సహా) ఆఫర్ రేటుతో జనవరి 26 – 28 వరకు మీ పార్క్ ఎంట్రీ టిక్కెట్‌లను ప్రీ-బుక్ చేయండి. పరిమిత కాల ఈ ఆఫర్ టిక్కెట్లు జనవరి 16 నుండి విక్రయించబడుతున్నాయి. కావున మీ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోండి.
ఇంతేనా: సందర్శకులు ‘వండర్ ఉమెన్’ వంటి అదనపు ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను కూడా ఆస్వాదించవచ్చు, ఇక్కడ మీరు “2 కొనండి మరియు 2 టిక్కెట్‌లను ఉచితంగా పొందండి” ఆఫర్ పొందవచ్చు. దీనిలో భాగంగా మహిళల కోసం కేవలం బుధవారాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తింప చేస్తారు. మంచి తగ్గింపును ఎవరు మాత్రం ఇష్టపడరు? మూడు రోజుల ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా మీ స్థానాన్ని సురక్షితం చేసుకోవచ్చు మరియు అద్భుతమైన 10% తగ్గింపునూ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. సందర్శకులు TSRTC బస్సులలో పార్కుకు ప్రయాణించడం ద్వారా అదనపు విలువ ఆఫర్‌ను పొందవచ్చు. వండర్ లా హైదరాబాద్ పార్క్ చేరుకోవడానికి TSRTC బస్సుల్లో ఎక్కే సందర్శకులు తమ బస్సు టిక్కెట్లను టిక్కెట్ కౌంటర్ వద్ద ప్రదర్శించడం ద్వారా పార్క్ ప్రవేశ టిక్కెట్లపై 15% తగ్గింపు పొందవచ్చు. వండర్ లా సందర్శకులను తమ ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com/ ద్వారా సుదీర్ఘ వారాంతాల కోసం ముందుగానే ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోమని లేదా 0841 4676333, +91 91000 63636కు కాల్ చేయమని ప్రోత్సహిస్తుంది.
ఈ కార్యక్రమం పై , వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ , “వండర్ లా హైదరాబాద్‌లో మా సందర్శకులకు లీనమయ్యే మరియు తక్కువ ఖర్చుతో మెరుగైన అనుభవాలను అందించడానికి అనేక ఆఫర్‌లను అందించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. లాంగ్ వీకెండ్‌లో ప్రీ-బుక్ చేసిన టిక్కెట్‌ల కోసం రూ.999 ఆఫర్ రేటు కుటుంబాలు మరియు థ్రిల్ కోరుకునే వారికి వండర్ లా లో పండుగలు మరియు లాంగ్ వీకెండ్ రెండింటిలోనూ ఉత్తమమైన ఆనందాన్ని పొందేందుకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. అదనంగా, TSRTC బస్ ఆఫర్ సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా. పార్క్ ప్రవేశ రుసుముపై 15% తగ్గింపును కూడా అందజేస్తుంది, మా సందర్శకులకు విలువను మరింతగా విస్తరింపజేస్తుంది. ఈ అద్భుతమైన అవకాశాలను ఉపయోగించుకోవాలని మరియు వారాంతంలో మాతో వండర్ లా లో వేడుక జరుపుకోవాలని మేము ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము…” అని అన్నారు.