ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం 

నవతెలంగాణ- చిట్యాల టౌన్
చిట్యాల పట్టణ కేంద్రంలో మంగళవారం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, అవిశెట్టి శంకరయ్యలు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జడల చిన్న మల్లయ్య యాదవ్, బీజేపీ నాయకులు చికిలంమెట్ల అశోక్ టిడిపి నాయకులు శేపూరి సుదర్శన్ ,బి.ఎస్.పి నాయకులు గ్యార మారయ్య తదితరులు పాల్గొన్నారు.