నవతెలంగాణ – కామారెడ్డి
ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లపై మంగళవారం జిల్లా కేంద్రంలోని కర్షక బీఈడీ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇడబ్ల్యఎస్ రిజర్వేషన్ల 10 శాతం కోటాతో బిసి, ఎస్సి,ఎస్టి సామాజిక వర్గాలు ఏ విధంగా నష్టపోతున్నాయనే దాని పరిణామాలతో భవిష్యత్తులో విద్యార్థులు ఎంత నష్టపోతారు, ఎలా నష్టపోతారు అనే విషయంపై మంగళవారం కర్షక్ బీఈడీ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బిసి,ఎస్సి, ఎస్టి, నాయకులు పాల్గొని సుదీర్ఘమైన చర్చ జరిపి తదుపరి కార్యాచరణకు సిద్ధమవుదామని కావున సోదరులందరూ అన్ని సంఘాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు జిల్లా, మండల నాయకులు,ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనవలసిందిగా అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆహ్వానిస్తున్నస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.