ఎస్సీ రిజర్వేషన్ల.. విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం…

– ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగలు అభివృద్ధి..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించి ఎన్నికల సమయంలో బీజేపి ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి  భైరపోగు శివకుమార్ మాదిగ అన్నారు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ లోని మినీ సెమినార్ హల్ లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భైరపోగు శివకుమార్ మాదిగ పాల్గొని మాట్లాడుతు బిజేపీ ఏదైనా ఒక సామాజిక అంశానికి సుదీర్ఘ కాలం మద్దతుగా ఉన్నదంటే అది కేవలం ఎస్సీ వర్గీకరణకు మాత్రమేనన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి సభలకు సమావేశాలకు వచ్చి వర్గీకరణ మీద మాట ఇచ్చి మోసం చేస్తుందని అన్నారు. బీజేపీ పార్టీ మాటలకు పరిమితం కాకుండా ఈ నెల 18 నుండి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే స్పందించి 18 నుండి జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలే చివరి సమావేశాలని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిజేపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.బివిఎం,ఎన్ ఎస్ యుఐ,ఎస్ ఎఫ్ ఐ, బిసి విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఒక కులానికి సంబంధించింది కాదని ఇది సామాజిక న్యాయం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు అందరికీ సమానంగా జనాభా నిష్పత్తి ప్రకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఎమ్మెస్ ఎఫ్ ఆధ్వర్యంలో తీసుకున్నే ప్రతి  కార్యక్రమం లో విద్యార్థి సంఘాలుగా మేము భాగస్వామ్యం అవుతామని వివిధ సంఘాల నాయకులు తెలిపారు.ఎమ్మెస్ ఎఫ్  యూనివర్సిటీ అధ్యక్షులు దినేష్ మాదిగ అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమంలోఅర్బాస్ ఖాన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కోమిరా శ్రీశైలం, ప్రసాద్,అనిల్, వెంకటరమణ, అఖిల్, రాజ్ కుమార్,నవీన్,శ్రవణ్, సుజన్, ముకేశ్, అతిఫ్, రెహమాన్, మహిళా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.