గౌతమ్ నగర్ లో రౌడీలు కత్తులతో దాడి

– తీవ్ర గాయాల పాలైన ఓ యువకుడు
నవతెలంగాణ -కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ లో శుక్రవారం రాత్రి సమయంలో రౌడీలు కత్తులతో దాడులు చేయగా ఓ యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ పంచాయతీ పరిష్కారం కోసం జరిగిన చర్చలు కాస్త ఘర్షణకు దారి తీశాయి. వివరాల్లోకి వెళితే.. గౌతమ్ నగర్ కు చెందిన ఆజీముద్దీన్ అతడి భార్య సన మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. అజీముద్దీన్ సోదరి సమ్రీన్ తనయుడిని వారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న తనయుడిని తిరిగి ఇవ్వాలని లేకపోతే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో దత్త పుత్రుడిని సనా తిరిగి ఇచ్చేందుకు నిరాకరించింది.ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నయీమ్, అవేజ్, షాదాబ్, సనాలు కలిసి అజీముద్దీన్ నివాసానికి వెళ్లారు. ఈ విషయంలో అజీముద్దీన్ కు అతని ఇంటికి వచ్చిన ముగ్గురికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య పరిష్కారం కోసం వచ్చిన ముగ్గురు తమ స్నేహితులైన అమీర్ అలియాస్ బర్సాత్ ఆమీర్, అర్మాన్ మాలిక్, ముదస్సిర్, సిరాజ్ మోహసిన్ లు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అజీముద్దీన్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతను ఇంట్లో లేకపోవడంతో అతడి తమ్ముడు మాజిద్ ఉండగా అవేజ్ కర్రలతో దాడి చేశాడు. బర్సాత్ ఆమెన్ తల్వార్ తీసి పొడిచాడు. ఈ ఘటనలో మాజీద్ చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీద్ ఒక్కసారిగా కేకలు వేయడంతో అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై ఆరో టౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బర్సాత్ అమీర్ ముదసీర్ లపై జంగల్ ఇబ్రహీం హత్య కేసులో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నిందితులు గత నెల 1న హత్యకు గురైన ఆరీఫ్ డాన్ అనుచరులుగా పోలీసులు తెలిపారు. గాయపడిన మజీద్ ను జిల్లా ప్రభుత్వాసుత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అని తెలిసింది.