రౌడి షీటర్ జిల్లా బహిష్కరణ..

Boycott of rowdy sheeter district..– మోయిజ్ జిల్లాలో ఎక్కడైనా కనపడితే పోలీసులకు సమాచారం అందించాలి
– సిరిసిల్ల పట్టణ  ఇన్స్పెక్టర్ కృష్ణ
నవతెలంగాణ – సిరిసిల్ల
పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసుల్లో నిందుతుడిగా ఉంటూ చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతు ప్రజా శాంతికి ఇబ్బందులు కలిగుస్తున్న రౌడి షీటర్ మహమ్మద్ మోయీస్ పాషా అలియాస్ మోయిజ్ అనే వ్యక్తిని జిల్లా నుండి ఆరు నెలలు బహిష్కరించడం జరిగిందని, జిల్లాలో ఎక్కడైనా కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. ఈసందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కి చెందిన మహమ్మద్ మోయీస్ పాషా అలియాస్ మోయిజ్ అనే వ్యక్తి పట్టణ పోలీస్ స్టేషన్లో 11(హత్య, హత్యాయత్నం,  బెదిరింపులకు పాల్పడిన,యూట్యూబ్ చానల్ వేదికగా వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టడం, మొదలగు  కేసులల్లో నిందుతునిగా ఉండి రౌడి షీటర్ ఉన్నపటికీ కూడా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతు ప్రజా శాంతికి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తూన్నాడన్న వస్తున్న పిర్యాదుల మేరకు అతనిపై తెలంగాణా సామాజిక వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం కింద, 1980 ప్రకారం జిల్లా నుండి ఆరు నెలల పాటుగా  బహిష్కరించడం జరిగిందని పటాన్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.జిల్లాలో ఎక్కడైనా మొయిజ్ కనపడితే అతని సమాచారం పోలీసులకు అందించాలని పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ వివరించారు. జిల్లాలో అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజా శాంతికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.