తాండూరులో గులాబీ హౌరు కారు జోరు

తాండూరులో గులాబీ హౌరు కారు జోరు– ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్‌లోని వివిధ వార్డుల్లో గు లాబీ హౌరు..కారు జోరు.. కొనసాగుతుంది. పట్ట ణంలో ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి ప్రచా ర కార్యక్రమం వాళ్ళతో పట్టణంలో దూసుకుపోతు న్నారు. తాండూరు మున్సిపల్‌ వ్యాప్తంగా రోహిత్‌ రె డ్డి సతీమణి ఆర్తిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతు న్నారు. ఆమె ప్రచారంలో అభివృద్ధికే తమ ఓటు అం టూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు లేపుతున్న వైనం కనిపిస్తుంది. ఎమ్మెల్యే విజయాన్ని అభ్యర్థిస్తూ తాండూరు మున్సిపల్‌ వ్యాప్తంగా వివిధ వార్డులలో పర్యటించి భారీ మెజార్టీ అందించాలని ఇంటింటి ప్ర చారం నిర్వహిస్తు ప్రజలను కలుస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతూ ‘ఆయ న వెంటే మేముంటాం’ అని భరోసా కల్పిస్తున్నారు. తాండూర్‌ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేను అసెంబ్లీకి మ రోసారి పంపాలని ప్రజలను కోరారు. బీఆర్‌ఎస్‌ నా యకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.