ముంబయి: కొత్త ఏడాదిలోనూ రూపాయి పతనం ఆగడం లేదు. గురువారం ప్రపంచ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ 9 పైసలు పతనమై 85.73 కనిష్ట స్థాయికి దిగజారింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి విలువ 85.79-85.68 మధ్య కదలాడింది. ఇంతక్రితం బుధవారం 85.64 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అత్యంత బలహీనమైన గణంకాలు, స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోవడం, పేలవ ఎగుమతుల తీరు, దిగుమతులు పెరగడం తదితర పరిణామాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి.