– సిద్దిపేట హోటల్ యజమానుల సంఘం అధ్యక్షులలు మధుసూదన్ గౌడ్
నవతెలంగాణ – సిద్దిపేట
రూ. 5,10, 20, కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నాయని, హోటల్ వారు తీసుకోవాలని సిద్దిపేట హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ అన్నారు. బాబు జగ్జీవన్ రాం భవన్ లో శుక్రవారం మీడియా సమావేశం నిరూపించారు. నూతనంగా ఎన్నికైన హోటల్ యజమానుల సంఘాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని హోటల్ ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. మీడియా వారికి హోటల్ పై ఎలాంటి అనుమానాలు ఉన్న, హోటల్ యజమాన్యాన్ని సంప్రదించి వారి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని, కానీ నిరాధార ఆరోపణలు చేయ వద్దన్నారు. నిజంగానే హోటల్ యాజమాన్యంది కానీ, సిబ్బందిది గాని తప్పు ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానన్నారు. సిద్దిపేట హోటల్ అసోసియేషన్ అధ్యక్షునిగా తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోవిందారం నవీన్, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గౌడ్, చిన్న, బాలు, నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, దుర్గారాజు, తదితరులు పాల్గొన్నారు.