నవతెలంగాణ – గోవిందరావుపేట
హాసన్ పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన జనగాని సదానందం గౌడ్ తన విధి నిర్వహణ లో భాగంగా ఈనెల 19 న ఉదయం 9 గంటలకు తాటి చేట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదావశాత్తు కాలు జారీ కింద పడగ అక్కడి క్కడే మృతి చెందటం జరిగిందని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సదానందం గౌడ్ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని పసర లో శ్రీనివాస్ మాట్లాడుతు 10 లక్షల ఎక్స్ గ్రేసీయా జీవో తక్షణమే విడుదల చేయాలనీ మెడికల్ బోర్డు విధానాన్ని సులభతరం చేయాలనీ అన్నారు.. ఏరియా హాస్పిటల్ లోనే తాటి చెట్ల ఫై పడిన బాధితులకు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కల్లు గీత కార్మికుల సమస్య ల ఫై కల్లు గీత కార్మికుల సమ్మేళనం ముఖ్య మంత్రి అధ్యక్షతన నిర్వహించాలని తాటి చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికునికి సెప్టి మొకులు ఇవ్వాలని ఏజెన్సీ లో గీత వృత్తి చేస్తున్నా గీత కార్మికుల కు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలనీ అన్నారు. పెండింగ్ లో ఉన్నా టాడి కార్పొరేషన్ చెక్కులు మరియు ఎక్స్ గ్రేషియా లు తక్షణమే విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య ల పరిష్కారం కొరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని గీత కార్మికుల కు పిలుపు నిచ్చారు.