పంచాయతీ సిబ్బందికి రూ.10 లక్షల భీమా

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని హసకొత్తూర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి రూ. 10 లక్షల ప్రమాద భీమా చేయించినట్లు ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ  సిబ్బందికి ప్రమాద భీమా రూ.520 ప్రీమియం చెల్లించి  పోస్ట్ ఆఫీస్ ద్వారా రూ.10 లక్షల పాలసీని  చేయించినట్లు వివరించారు. ఈ మేరకు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో తపాలా శాఖ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది వివరాలను సేకరించి, పాలసీలను అందించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ద్వారా రూ.10 లక్షల ప్రమాద బీమా పాలసీలను అందించడం పట్ల పంచాయతీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్, పంచాయతీ పాలకవర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ  కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.