న్యూఢిల్లీ : గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్‌నకు చెందిన 250 మెగావాట్ (500ఎండబ్ల్యుహెచ్) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టును బిడ్డింగ్‌లో విజయవంతంగా దక్కించుకున్నట్లు జెన్సోల్ ఇంజనీరింగ్ తెలిపింది. ఈ ప్రాజెక్టు గుజరాత్ రాష్ట్రంలోని డిస్కమ్‌లకు పీక్, ఆఫ్ అవర్స్‌లో ఆన్ డిమాండ్ ప్రతిపాదికన విద్యుత్‌ను సరఫరా చేయనుందని పేర్కొంది.