పన్నుల్లో పంపిణీ కింద తెలంగాణకు రూ. 1,533.64 కోట్లు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పన్నుల్లో పంపిణీ వాటా కింద నవంబర్‌ నెలకు గాను తెలంగాణ రాష్ట్రానికి రూ.1,533. 64 కోట్లను కేంద్రం విడుదల చేసింది. సాధారంగా ప్రతి నెల 10న ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈసారి మూడు రోజుల ముందుగానే పన్నుల్లో పంపిణీ వాటాలను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు వెల్లడించింది. పండుగ సమయంలో ముందస్తు నిధుల విడుదల రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేస్తోందని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.