– బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2024 బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులను రూ.20 వేల కోట్లకు పెంచాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా రాబోయే ఐదేండ్లలో బీసీలకు రూ.లక్ష కోట్లను కేటాయిస్తామంటూ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో సమీకృత బీస,ీ గిరిజన, మైనారిటీ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలకు భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు.