మర్పల్లిలో రూ.3.26 లక్షలు స్వాధీనం

నవతెలంగాణ-మర్పల్లి
మర్పల్లి టీ జంక్షన్‌లో పోలీసులు గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగం గా ఎలాంటి పత్రాలు లేని రూ.3,26,920 స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు మండలక్దేంరంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు వాహనాలు ఆపారు. అందులో డబ్బు ఉన్నట్టు గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బును సాక్షుల ఎదుట సీజ్‌ చేశారు. జహీరాబాద్‌కు చెందిన సందీప్‌, సదాశివపేట్‌కు చెందిన దస్తగిరి అనే వ్యక్తులు డబ్బులు తరలించినట్టు తెలిపారు.