– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని రుద్రారం గ్రామ పంచాయతీ నూతన భవనవ నిర్మాణం కోసం రూ.20 లక్షలు, పెద్దతూండ్ల, రుద్రారం గ్రామాల్లోని అంగన్ వాడి కేంద్రాల నూతన భవనాల నిర్మాణాలకు రూ.16 లక్షలు,మొత్తం రూ.36 లక్షల నిధులను మంజూరు చేయించిన రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య మంగళవారం ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి,పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం దుద్దిళ్ల కుటుంబం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.