దేవ్‌ ఐటికి రూ.4.41 కోట్ల ఆర్డర్‌

న్దేవ్‌ ఐటికి రూ.4.41 కోట్ల ఆర్డర్‌యూఢిల్లీ : అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఐఒటి, ఎఐ సేవల సంస్థ లిలికోరు హోల్డింగ్స్‌ నుంచి 5.51 లక్షల డాలర్లు (దాదాపు రూ.4.41 కోట్లు) విలువైన ఆర్డర్‌ను పొందినట్లు దేవ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ తెలిపింది. ఈ ఆర్డర్‌లో కస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్థి చేయాల్సి వుంటుందని పేర్కొంది. ఇందుకోసం తమ 40 మంది పైగా అత్యంత నిష్ణాతులు పని చేయనున్నారని వెల్లడించింది. లిలికోరు ఆర్డర్‌ తమ సంస్థకు ఓ మైలురాయి అని దేవ్‌ ఐటి తెలిపింది. ఇది ప్రపంచ స్థాయిలో మరింత వృద్థి, సహకారానికి వేదికను ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.