– డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి
– రాహుల్ గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం
నవతెలంగాణ-ఆమనగల్
రాబోయే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే అర్హులైన లబ్దిదారులు అందరికీ రూ.4 వేలు పింఛన్లు అందజేస్తామని డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన ఖమ్మం సభలో ఏఐసీసీ ప్రధాన నాయకులు రాహుల్ గాంధీ అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.4 వేలు పించన్లు ఇస్తామని ప్రకటించిన సందర్భంగా సోమవారం ఆమనగల్, కడ్తాల్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులు రాహుల్ గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. అర్హులైన వారికి రూ.4 వేలు ఆసరా పింఛన్లు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణ మాఫీ, ప్రతి ఏటా ఖాళీ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర వాటిని అమలు చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, పట్టణ అధ్యక్షుడు రాంచందర్ నాయక్, నాయకులు లక్ష్మయ్య, మల్లేష్, కేశవరెడ్డి, యాదయ్య, సత్యం యాదవ్, రామకృష్ణ, జంగయ్య, భానుకిరణ్, రాజేష్, రవి, ఇమ్రాన్ బాబా, రమేష్, శ్రీకాంత్, లింగం, రఘు, భరత్ యాదవ్, మహేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్ లో జరిగిన కార్యక్రమంలో రాజశేఖర్, శ్రీధర్, సాజిద్, షఫి, ప్రసాద్, రామస్వామి, రాములు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.