నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో వాహనాల తనిఖీల సందర్భంగా రూ.40లక్షలను పోలీసులు పట్టుకున్నారు. తాండూర్ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఆపారు. వీరి వద్ద రూ.40లక్షలు లభ్యమయ్యాయి. వాటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో డబ్బులు సీజ్ చేశారు. ఈ ఇద్దరు పెద్దేముల్ మండలం మారేపల్లిలోని సుమిత్ర కాటన్ మిల్లుకు చెందిన వినరు గార్గ్, వీరారెడ్డిగా గుర్తించారు. డబ్బును స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు అప్పగించారు.