బైజూస్‌లో రూ.4వేల కోట్లు హుష్‌..

– నిండా మునిగిన నెథర్లాండ్‌ కంపెనీ
బెంగళూరు : కరోనాకు ముందు ఓ వెలుగు వెలిగిన ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌లో రూ.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ప్రోసస్‌ ఎన్‌వి నిండా మునిగినట్లు ప్రకటించింది. 2018లోని తమ పెట్టుబడులు ఇప్పుడు సున్నా విలువకు పడిపోయినట్లు తెలిపింది. తాము బైజూస్‌లో పెట్టిన పెట్టుబడుల వాటాను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. బైజూస్‌ ఆర్థిక పరిస్థితులు, అప్పులు, భవిష్యత్‌ అంచనాలకు సంబంధించి తమవద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆ సంస్థ విలువను తాము సున్నాకు తగ్గిస్తున్నట్లు ప్రోసస్‌ తెలిపింది. తద్వారా తమకు 493 మిలియన్‌ డాలర్లు (రూ.4వేల కోట్లు) మేర నష్టం వాటిల్లినట్లు ఆ కంపెనీ పేర్కొంది.