రైతులకు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలి 

– జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో మంగళవారం రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ టిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తుంది. వెంటనే గ్రామాల వారిగా పంట నష్టాన్ని అంచనా వేయాలి.అధికారుల బృందాలను నియమించి యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలి.నష్ట పరిహార వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపి ఎకరాకు రూ.25,000 నష్టపరిహారం అందించేలా చూడాలి.వానాకాలం పోయి యాసంగి వచ్చిన వడ్లకు బోనస్ పై ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. ఒకవైపు యాసంగి ధాన్యం కొనుగోలు మొదలైన బోనస్ పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు.ఇప్పటికే సాగునీలు కరువై పంటలు ఎండిపోతుంటే కనీసం బోనస్ తో అయినా ఊరట లభిస్తుందని రైతులు అనుకుంటే దాన్ని నిరాశగానే మిగిల్చారు. కొత్తగా ఎన్నికల కోడ్ ఉందని సాకు చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీపై నోరు మెదపడం లేదు.రైతుల పక్షాన ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు.ఒకవైపు నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు అధికారులు చోద్యం చూస్తున్నారు.మార్పు రావాలని ప్రజలు ఎలాగైతే కోరుకున్నారో మళ్లీ మార్పు రావాలని అదే ప్రజలు కోరుకుంటున్నారు.ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ను మళ్ళీ చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో  మేయర్ దండు నీతూ కిరణ్, జెడ్పి ఛైర్మెన్ దాదన్న గారి విఠల్ రావు ,బి అర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, నాయకులు సుజిత్ సింగ్, సత్యప్రకాశ్, సుదాం రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.