ముంబయి : దీపావళి సందర్బంగా టపాసుల కాల్చే సమయంలో ప్రమాదవశత్తు గాయపడే వారికి బీమా అందించే ఉద్దేశ్యంతో కొత్త తరహా బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఫోన్ పే తెలిపింది. రూ.9 చెల్లించడం ద్వారా రూ.25వేల వరకు కవరేజీ పొందవచ్చని పేర్కొంది. అక్టోబర్ 25 నుంచి 10 రోజుల పాటు ఈ బీమా కవరేజీ లభిస్తుందని వెల్లడించింది. ఫోన్‌పేలోని ఇన్సూరెన్స్ విభాగంలోకి వెళ్లి ‘ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్’ను క్లిక్ చేసి దీన్ని పొందవచ్చని పేర్కొంది.