బహుజనుల  ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: అరుణ్ కుమార్

– బీ.ఎస్.పి వేములవాడ నియోజకవర్గ కన్వీనర్ గసికంటి అరుణ్ కుమార్..
నవతెలంగాణ – వేములవాడ 
బహుజనుల  ద్రోహి..వ్యక్తిగత ప్రయోజనాల కోసం బహుజన సమాజ్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మండిపడ్డారు, బిఎస్పి  వేములవాడ నియోజకవర్గ కన్వీనర్ గసికంటి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనులకు తీరని అన్యాయం చేసినప్పటికీ ఏ ఒక్కరం అధైర్య పడబోమని  కాన్షిరాం స్ఫూర్తితో ముందుకు వెళ్తామని అని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త బహుజన రాజ్యాధికార దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఎవరో వచ్చి స్వార్థ ప్రయోజనాల కోసం బహుజన సమాజ్ పార్టీని, ద్యేయాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే చేతులు కట్టుకుని కూర్చోమని ఒక్కరు పోతే వెయ్యి మంది కాన్సిరాములు తయారవుతారని బహుజన సమాజ్ పార్టీని నడిపిస్తారని అన్నారు.