– బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జోగుప్రదీప్
నవతెలంగాణ – తిమ్మాజిపేట
ఈ ప్రాంత వాసీ అయిన డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిపిస్తే నాగర్కర్నూల్ ప్రాంతంతో పాటు విద్యాభివృద్ధి పేద పిల్లలు ఎంతో అభివద్ధి చెందుతారని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు జోగు ప్రదీప్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకోసం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉద్యోగాన్ని సైతం వదులుకొని నిస్వార్ధంగా సేవ చేయడానికి ముందుకొచ్చిన డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆశీర్వదించాలని కోరారు. నాగర్కర్నూల్ అభివద్ధి కోసం పాటుపడే ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీగా అర్హుడని , బలమైన అభ్యర్థి అని గెలిపిస్తే పార్లమెంట్లో నెంబర్ వన్ నాయకుడుగా నిలుస్తారని భాషా భావం సంపూర్ణ అవగాహన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఉందని అన్నారు. గురుకులాల పాఠశాలలను దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సెక్రెటరీగా పనిచేసి పది లక్షల మంది పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందరి అన్నారు. ఆయన ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తారని అన్నారు. అబద్ధం హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కి.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉన్న కాంగ్రెస్‌ను నిలదీయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారును గెలిపించాలని కోరారు. గుంపు మేస్త్రీకి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నారు. కారు గుర్తుకు ఓటేసి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అధిక మెజార్టీతో గెలి పించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ , నాయకులు పీ. స్వామి హుసేని కొత్త వెంకటేష్ సలావుద్దీన్, కాళ్ళ రాజు, కే సురేష్, మన్యం టైగర్ నరసింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.