– కడ్తాల్ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
– బీఆర్‌ఎస్ ప్రచార రథాన్ని ప్రారంభించిన జర్పుల
నవతెలంగాణ-ఆమనగల్
నాగర్ కర్నూల్ పార్లమెంటు బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కడ్తాల్ మండల కేంద్రములో స్థానిక నాయకులతో కలిసి ఆయన బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులుగా ప్రజా గొంతుక, ఉన్నత విద్యావంతుడైన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు కానుక గా పంపు దామని ఆయన చెప్పుకొచ్చారు. ఆదిశగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, మాజీ సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, హరిచంద్ నాయక్, శ్వేతా భూనాథ్, సులోచన సాయిలు, డైరెక్టర్ సేవ్యా నాయక్, మాజీ ఉపసర్పంచ్లు శారదా పాండు నాయక్, రమణ, నాయకులు నరసింహ, వెంకటేష్, భీమన్ శ్రీను, కష్ణయ్య, వెంకటేష్, కష్ణ, అంజి, రాజు, శీను, శ్రీకాంత్, రమేష్, సూర్య, చందు తదితరులు పాల్గొన్నారు.