చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ

– బోడపట్ల రవీందర్‌
– పార్టీ సభ్యులు క్రమశిక్షణ కలిగి ఉండాలి
– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు
– విజయవంతంగా ముగిసిన రాజకీయ శిక్షణ తరగతులు
నవతెలంగాణ-కూసుమంచి
భారతదేశ చరిత్రను నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ కను సైగల్లో బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తుందని, పాఠ్యపుస్తకాల్లో మత సంస్కృతిని ప్రవేశ పెట్టె ప్రయత్నం బీజేపీ చేస్తుందని పార్టీ నాయకులు బోడపట్ల రవీందర్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని యడవెల్లి పద్మా రెడ్డి భవనంలో జరుగుతున్న పార్టీ సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో రెండోవ రోజు ఉదయం సెక్షన్లో మతం- మతోన్మాదం అనే సబ్జెక్టుపై ఆయన బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశ లో బీజేపీ మతోన్మాదం ప్రమాదకరంగా మారుతుందని, విద్యను కాషాయకరణ చేసే పనిలో నిమగమై ఉందని, చరిత్రను వక్రయిస్తూ పాఠ్యపుస్తకాలలో మార్పులు చేస్తుందని తెలిపారు. మత మతోన్మాద ప్రయత్నాలకు అడ్డుకట్టలు వేయకపోతే భారత దేశ ప్రజల మనుగడకే ప్రమాదవని, మైనార్టీ ప్రజలు భారతదేశంలో నివసించలేని పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి మతోన్మాద ప్రయత్నంతో ప్రజలను భయాందోళనకు గురిచేసి ప్రమాదం ఉందని, ఈ ప్రయత్నాలను తిప్పి కొట్టాలంటే ఒక కమ్యూనిస్టు పార్టీ సభ్యులకే సాధ్యమవుతుందని, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ దేశంలో మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు ప్రజలను వివరించాల్సిన బాధ్యత కమ్యూనిస్టు సభ్యులపై ఉందని, అలా ప్రతి కమ్యూనిస్టు సభ్యుడు దేశ రాజకీయ మతాల పైన అవగాహన కలిగి ఉండి, దేశాన్ని మతోన్మాదుల చేతుల నుండి కాపాడాల్సిన బాధ్యతల్లో కమ్యూనిస్టుల పాత్ర ముఖ్యమైనదని, అందుకు అనుగుణంగా ప్రతి సభ్యులు పనిచేయాలని ఆయన కోరారు.
పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలి : సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు
కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి వుండాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు అన్నారు. రెండోవరోజు పార్టీ క్లాస్‌ బోధించడానికి విచ్చేసిన ఆయన పార్టీ నిర్మాణం అనే సబ్జెక్ట్‌ పై క్లాస్‌ బోధించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీ చరిత్ర మహౌన్నతమైనదని, దేశ అభివృద్ధిలో, భారతదేశ స్వాతంత్య్రం అనంతరం నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ ముఖ్య భూమిక పోషించిందని, కమ్యూనిస్టు పార్టీ నాయకులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. మల్లెల సన్మతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్‌గా సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు శీలం గురుమూర్తి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శి యడవెల్లి రమణారెడ్డి, తోటకూరి రాజు, మండల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాలకు చెందిన శాఖ కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.