ప్రజాస్వామ్యాన్ని ‘ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ’ బలహీనపరుస్తున్నాయి

– ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు
– బీజేపీ తప్పులకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతిస్తుందా..? : ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌కు మాజీ సీఎం లేఖ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఓట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతల ఈ చర్యలపై కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓట్లే కీలకం. అలాంటి ఓట్లను తొలగించి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు.
‘గతంలో బీజేపీ నేతలు చేసిన తప్పులకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతిస్తుందా? బీజేపీ నేతలు ఓట్ల కోసం డబ్బును పంచారు. ఢిల్లీలోని దళితులు, పూర్వాంచల్‌ కమ్యూనిటీకి చెందిన వారి ఓట్లను బీజేపీ నేతలు తొలగించాలని ఆ లేఖలో ప్రస్తావించారు