ఆరెస్సెస్‌ హిందూత్వ విద్వేషపూరితం

RSS is anti-Hinduismపాలక పార్టీ ప్రాధాన్యత మసకబారడం, ప్రతిపక్షం బలం పుంజుకోవడం లాంటి కారణాల రీత్యా నూతన పార్లమెంట్‌లో ప్రతిపక్షం తన స్వరాన్ని పెంచింది. ప్రారంభసభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించిన తరువాత జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ, దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని తన ప్రసంగంలో లేవనెత్తడం ద్వారా స్పందించాడు. తన ప్రసంగంలోని (బహుశా తొలగించబడిన) భాగం హిందూ మతం స్వభావానికి సంబంధించినది. ఆయన చెప్పే దాని ప్రకారం, హిందూ మతం సత్యం, అహింసపై ఆధారపడి ఉంటుంది.”భారతదేశం అహింసా మార్గాన్ని అనుసరించే దేశం, భయానికి సంబంధించిన దేశం కాదు. మన మహాపురుషులు అహింస గురించి, భయాన్ని అధిగమించే విషయం గురించి మాట్లాడినారు.””హిందువులమని చెప్పుకునే వారు రోజంతా హింస, ద్వేషం, అసత్యాల గురించే మాట్లాడుతున్నారని,” రాహుల్‌ గాంధీ భారతీయ జనతాపార్టీకి చెందిన ఎంపీల వైపు చూపిస్తూ మాట్లాడినాడు.
చాలామంది సాధువులు రాహుల్‌ గాంధీ ప్రకటనలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. రాహుల్‌గాంధీ, హిందువులందర్నీ హింసావాదులని అన్నాడని, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు అనుబంధ సంస్థలు పట్టణాలకు వెళుతున్నాయి. మరోవైపు హిందూ మతం అంటే సత్యం, అహింస, ప్రేమలపై ఆధారపడు తుందని రాహుల్‌ గాంధీ వివరణ ఇచ్చాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలు, రాహుల్‌ గాంధీ, అతని కుటుంబ సభ్యులు అంటే మనదేశానికి ప్రధానమంత్రులుగా సేవలందించిన జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలపై విమర్శలు చేస్తూ, వీరి భావజాలం సత్యానికి దూరంగా ఉంటుందని అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పేదాని ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ మొదటితరం కేవలం మైనార్టీలు, వారి ఓటు బ్యాంకును కాపాడే విషయం గురించే ఆందోళన చెందుతూ వచ్చింది.
హిందూ మతం మానవీయ కోణాన్ని వివరించిన రాహుల్‌ గాంధీకి ఇండియా కూటమి నుండి చాలామంది మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం హిందూ మతం, హిందూత్వ పదాల ప్రయోగం మధ్య కొంత సందిగ్ధత ఉంది. హిందూత్వ గురించి తన అభిప్రాయాలు కూడా రాహుల్‌ గాంధీ హిందూమతం గురించి వివరించిన విధంగానే ఉన్నాయని ఉద్ధవ్‌ థాక్రే అన్నాడు. నెహ్రూ తన సాంప్రదాయికత విరోధి అభియాన్‌ (మతతత్వానికి వ్యతిరేక ప్రచారం) పనిని ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగానే ప్రారంభించాడని ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్తలు విమర్శిస్తున్నారు.
సోమనాథ్‌ దేవాలయాన్ని నాటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్‌ ప్రారంభించ డాన్ని నెహ్రూ వ్యతిరేకించినందుకు కూడా వారు ఆయనను వ్యతిరేకిస్తు న్నారు. దయానంద సరస్వతి, స్వామీ వివేకానంద, బంకించంద్ర ఛటర్జీ, శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీల నుండి ఆరెస్సెస్‌ హిందూత్వ ఏర్పడిందని వారు వాదిస్తారు. ఆరెస్సెస్‌ భావజాలానికి, దయానంద సరస్వతి, స్వామీ వివేకానంద భావజాలానికి ఎలాంటి సంబంధమే లేదు. కేవలం వారి భావజాలాన్ని కప్పిపుచ్చేందుకు మాత్రమే వారి పేర్లను ఉపయోగిస్తున్నారు.
హిందూమతం – హిందూత్వ
హిందూ మతం అనేది ఒక ప్రవక్త ఆధారిత మతం కాదు కాబట్టి హిందూ మతం గురించి అనేక వివరణలను పయోగించారు. హిందూమతానికి చెందిన పవిత్రమైన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లేక మనుస్మతిలలో హిందూ అనే పదమే లేదు. ఈ పదాన్ని సింధూ పశ్చిమ ప్రాంతం నుండి వచ్చిన వారు సష్టించారు.వారు ”స” అనే శబ్దాన్ని ”హ” గా పలకడం వలన ”సింధూ”, ”హిందూ” గా మారింది. మొదట్లో ఈ పదం సింధూ నది నుండి సముద్రం వరకు వ్యాపించిన ప్రాంతాన్ని సూచించింది. ఇక్కడ వైదిక మతం (దీనిని బ్రాహ్మణమతం అని కూడా పిలవచ్చు), తంత్ర, అజివికాస్‌, నాథ్‌, శైవ, బౌద్ధ, జైన పూర్వ మత ధోరణులు కూడా ప్రధానంగా ఉన్నాయి.
తరువాత కాలంలో ”హిందూ” అనే పదం ఇక్కడ ఉన్న విభిన్న ధోరణుల (జైన, బౌద్ధ మతాలను మినహాయిస్తే) సమ్మేళనంగా మారింది. బ్రాహ్మణమతాన్ని మినహాయించి, మిగిలిన ధోరణులను శ్రమణులు అని అన్నారు. బ్రాహ్మణ మతంలో కుల, లింగ శ్రేణీగత వ్యవస్థ ఉండడమే బ్రాహ్మణ మతానికి, శ్రమణులకు మధ్య ఉండే ప్రధానమైన వ్యత్యాసం. ”హిందూమతం” అనే పద నిర్మాణం గురించి ప్రముఖ చరిత్రకారుడు డీ.ఎన్‌.ఝా, 2006లో జరిగిన ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌లో తన అధ్యక్షోపన్యాసంలో చక్కగా వివరించాడు. ”హిందూ అనే పదం వలస రాజ్యానికి ముందు భారతదేశంలో వాడుకలో ఉంది, కానీ ఇది 18 వ శతాబ్దం చివరలో, 19వ శతాబ్దం ప్రారంభంలో లేదు. దీనిని బ్రిటీష్‌ స్కాలర్లు తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని” ఆయన పేర్కొన్నాడు. అప్పటి నుండి ఇది చాలా విస్తత వినియోగంలో ఉంది. ఈ పదాన్ని ఉపఖండంలో సిక్కులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు, క్రైస్తవులు తప్ప అందరికీ ఉపయోగిస్తున్నారు.
కఠినమైన సరిహద్దులేమీ లేకపోవడం వల్ల బ్రాహ్మణ స్రవంతి వేదాలను, మనుస్మతిని పవిత్రమైన గ్రంథాలుగా ముందుకు తెచ్చింది. హిందూమతం యొక్క ప్రధానమైన అవగాహనలు కూడా మారాయి. అంబేద్కర్‌ దష్టిలో హిందూమతంపై కుల వ్యవస్థ అయిన బ్రాహ్మణ మతం ఆధిపత్యం చెలాయించింది. అదే, ఆయన మనుస్మతిని తగులబెట్టడానికి దారితీసింది. మరోవైపు మహాత్మా గాంధీ తనను తాను సనాతన హిందువుగా చెప్పుకున్నాడు. ఆయన అక్టోబర్‌ 6, 1921 లో ‘యంగ్‌ ఇండియా’లో ఇలా పేర్కొన్నాడు, ”ఎవరి స్వంత విశ్వాసం లేదా ధర్మం ప్రకారం వారు దేవుని ఆరాధించాలని హిందూ మతం ప్రతీ ఒక్కరికీ చెపుతుంది. అది అన్ని మతాలతో శాంతియుతంగా జీవిస్తుంది.” మతాంతర సంబంధాలు, బహుళత్వానికి ఒక ప్రత్యేకమైన భావన! ఇప్పుడు రాహుల్‌ గాంధీ హిందూ మతం గురించి మాట్లాడుతూ హిందూ మతానికి సత్యం, అహింస, ప్రేమ ప్రధానమైన లక్షణాలని అదేపనిగా చెపుతున్నాడు.
‘హిందూత్వ’ అనే పదాన్ని 1892లో చంద్రనాథ్‌ బసు సష్టించి, దానిని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించే ఆదర్శానికి అనుసంధానం చేశాడు. రాజకీయపరంగా ‘హిందూత్వ’ అనే పదాన్ని 1923లో సావర్కర్‌ తన ”ఎసెన్షియల్స్‌ ఆఫ్‌ హిందూత్వ” రచనలో సష్టించి, నిర్వచించాడు. ఈయన హిందూత్వ ఆర్యన్‌ జాతి, ఈ పవిత్ర భూమి (సింధూ నుండి సముద్రాల వరకు), బ్రాహ్మణ సంస్కతిపై ఆధారపడి ఉంది. సావర్కర్‌ బౌద్ధమతం బోధించే అహింసను చాలా తీవ్రంగా విమర్శిస్తూ, భారతదేశ బలహీనతకు బౌద్ధమతం ప్రచారం చేసిన అహింసే ప్రధాన కారణం అని అన్నాడు. ఇది పూర్తిగా మన చరిత్ర అవగాహనకు వక్రీకరణ. ఆధునిక భావంలో దేశం అనేది లేదు. ఒకవేళ మనం దేశంతో సమానమైన సామ్రాజ్యాలను ఆమోదించాలంటే, అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ప్రాచీన భారతదేశంలో ఆయన సామ్రాజ్యమే అతి పెద్దదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ భూమిని తన పితభూమిగా, పవిత్ర భూమిగా పరిగణించాడో అతడే హిందువు అని సావర్కర్‌ నిర్వచించాడు.
ఆరెస్సెస్‌ సావర్కర్‌ను అనుసరించి, ఇస్లాం, క్రైస్తవ మతాలను విదేశీ మతాలుగా పరిగణిస్తూ, ప్రాచీన పవిత్ర మత గ్రంథాలను (ఉదా:- మనుస్మతి) సమర్థిస్తుంది. ఆరెస్సెస్‌ తన మతంలో భాగంగా హింసను సష్టించింది. తన ప్రధాన కార్యాలయం వివిధ ఆయుధాలను ప్రదర్శించి, దసరా పండుగ రోజున వాటికి పూజలు నిర్వహిస్తుంది. ఆరెస్సెస్‌ శాఖలు ఖిల్జీ, బాబర్‌, ఔరంగజేబు లాంటి ముస్లిం రాజులను క్రూర పాలకులుగా చిత్రించడం ద్వారా, రాణా ప్రతాప్‌, శివాజీ, పధ్వీరాజ్‌ చౌహాన్‌ లాంటి హిందూ రాజులను కీర్తించడం ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేశాయి. అన్ని మతాలకు చెందిన ప్రజలంతా జాతీయోద్యమంలో పాల్గొన్న కారణంగా ఆ ఉద్యమాన్ని కూడా ఆరెస్సెస్‌ విమర్శించింది. ఇది దేవాలయాల విధ్వంసం, గొడ్డుమాంసం, బలవంతపు మత మార్పిడులు లాంటి భావోద్వేగ సమస్యల్ని చేపట్టింది కాబట్టి తనను తాను హిందువుల ప్రతినిధిగా చెప్పుకుంటుంది. 1948లో ఆరెస్సెస్‌పై నిషేధం విధించిన తరువాత సర్దార్‌ వల్లభారు పటేల్‌, అది వ్యాప్తి చేసిన విద్వేషాన్ని ఎత్తి చూపుతూ ఇలా అన్నాడు: ”వారి ప్రసంగాలు మొత్తం మతోన్మాద విషంతో నిండి ఉన్నాయి. ఆ విషం యొక్క చివరి ఫలితంగా, దేశం వెలకట్టలేని గాంధీజీ జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది.”
మహాత్మాగాంధీ నుండి రాహుల్‌ గాంధీ లాంటి నాయకులు హిందూ మతం యొక్క మానవీయ కోణాన్ని విస్తరించి, పెంచారు. సావర్కర్‌-ఆరెస్సెస్‌లు ద్వేషపూరిత మార్గాన్ని అనుసరించిన ఫలితంగా హింసా మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. అంబేద్కర్‌, హిందూ ఆచరణలో బ్రాహ్మణాధి పత్యానికి వ్యతిరేకంగా నిలబడగా, మహాత్మాగాంధీ, రాహుల్‌ గాంధీకి, హిందూ మతానికి అందరినీ కలుపుకొనిపోయే, అహింసాయుతమైన అర్థాన్నిచ్చాడు.
(”ద వైర్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
– రామ్‌ పునియానీ