హిందూ రాజ్యాన్ని పునరుద్ఘాటిస్తున్న ఆరెస్సెస్‌ అధినేత

RSS leader reasserting Hindu Rajyaఅక్టోబర్‌ 12, 2024 విజయదశమిని, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు సంస్థాపక దినంగా పరిగణిస్తుంది కాబట్టి అదే రోజున సాంప్రదాయం ప్రకారం ఆరెస్సెస్‌ అధినేత, సర్సంగ్‌ చాలక్‌ అయిన మోహన్‌ భగవత్‌ ప్రసంగించాడు. ఆయన ప్రసంగం, 2024 మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలం తగ్గిన తరువాత ఆయన చేసిన వేరొక ప్రసంగం నేపథ్యంలో సాగింది. ఆ ప్రసంగంలో భగవత్‌, ‘తాను దేవుడు పంపిన జీవ సంబంధం లేని’ వ్యక్తినని అనుకున్నానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బీజేపీ బలం 303 స్థానాల నుంచి 240 స్థానాలకు పతనమైంది కాబట్టి ‘ఒక మనిషి సూపర్‌ మ్యాన్‌ కావాలనుకుంటాడు, తరువాత ఒక దైవం, ఆ తరువాత భగవంతుడు కావాలనుకుంటాడని’ భగవత్‌ పేర్కొన్నాడు. బీజేపీ కి అంతగా సామర్ధ్యం లేదు కాబట్టి ఇంతకుముందు ఆరెస్సెస్‌ సహాయాన్ని కోరింది, ఇప్పుడు ‘మరింత సామర్థ్యం’ గా మారిందని బీజేపీ చెప్పుకున్న మొదటి ఎన్నికలు కూడా బహుశా ఇవేనేమో.
ఆ ప్రసంగంతో భగవత్‌, మోడీలో పెరుగుతున్న అహంభావాన్ని తగ్గించాడు. ఆరెస్సెస్‌ అనుబంధ సంఫ్‌ు పరివార్‌ శక్తులన్నీ ఇటీవల హర్యానాలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యంత చురుగ్గా పనిచేశాయి. ఎన్నికల కమిషన్‌ ‘పలుకుబడి సహాయం’తో, కాంగ్రెస్‌ ‘ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న’ భావనను తలకిందులు చేస్తూ బీజేపీ హర్యానా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు, బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాలను తీసుకొని, ఆరెస్సెస్‌ లక్ష్యాలను, హిందూత్వ రాజకీయాల ముఖ్యాంశాలను వివరిస్తూ తన విజయదశమి ప్రసంగంలో భగవత్‌ బీజేపీ విధానాల్ని పునరుద్ఘాటించాడు.
‘డీప్‌ స్టేట్‌ ‘(ప్రభుత్వ విధానాల్ని అదుపు చేసే చర్యల్లో భాగస్వామి),’ వోకిజం'(మేల్కొలుపు),’ కల్చరల్‌ మార్క్సిస్టు’ (సాంస్క తిక మార్క్సిస్టు) లాంటి పదాలు, అన్ని సాంస్కతిక సాంప్రదా యాలకు శత్రువులని ఆయనన్నాడు. విద్యాసంస్థల్ని వారి అదుపులోకి తెచ్చుకోవడమే వారి మొదటి విధానం. తరువాత వారు సమాజంలోని ఆలోచనలు, విలువలు, విశ్వాసాలను ధ్వంసం చేస్తారు.ఆ తరు వాత కత్రిమంగా సమస్యల్ని సష్టించి, ప్రజల్లో బాధిత భావనను అంతర్నిర్మాణం చేస్తారు. తరువాత ప్రజల్లో అసంతప్తిని పెంచి, ప్రజల్ని దూకుడుతనంతో ఉండేలా చేసి, అరాచకత్వపు వాతావరణాన్ని సష్టించి, ఈ వ్యవస్థ, చట్టాలు, పాలన పట్ల ద్వేష భావాల్ని రెచ్చగొట్టి, ప్రజల్లో భయాన్ని పెంచుతారు. అప్పుడు దేశంపై ఒకరి ఆధిపత్యాన్ని సష్టించడం తేలిగ్గా జరిగిపోతుంది. ముఖ్యంగా తక్కువగా జనాదరణ పొందిన పదం, ‘వోకిజం’ సామాజిక, రాజకీయ అన్యాయాల పట్ల సున్నితంగా ఉండే ప్రజల ప్రవర్తన, దక్పథాలకు ఎక్కువగా మితవాదులు అవమానకరమైన రీతిలో ఉపయోగిస్తారు. భగవత్‌ ప్రసంగంలో ఇది చాలా ముఖ్యమైన వాక్యం.
హిందూ మితవాదులు సామాజిక, రాజకీయ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తారు కాబట్టి ఆరెస్సెస్‌ సంఫ్‌ు పరివారం తన శాఖల ద్వారా (ఉదయం వ్యాయామాలు), సరస్వతీ శిశు మందిరాలు, ఏకలవ్య విద్యాలయాల్లాంటి పాఠశాలల ద్వారా, తన విశాల నెట్‌వర్క్‌ ద్వారా మౌఖికంగా ప్రచారం చేసే విధానాన్ని అవలంబించింది. ఈ విధానం సాంప్రదాయవాదం, కుల, లింగ శ్రేణీగత వ్యవస్థలను ప్రోత్సాహించే సామాజిక లోకజ్ఞానాన్ని ప్రభావితం చేస్తుంది. బీజేపీ ఐటీసెల్‌, కార్పోరేట్‌ రంగం అదుపుచేసే మీడియా ద్వారా సమాజంలోని ఓ పెద్ద భాగం ఆలోచనను హిందూ జాతీయవాద బోధనలు రూపుదిద్దుతున్నాయి.
ఇప్పుడు ‘వోకిజం’ అంటే అర్థం ఏమిటి? ఇది న్యాయబద్ధమైన సమాజాన్ని కోరుకుంటుంది. ఇది కులం, మతం, వర్ణం, భాషల ఆధారంగా చూపే వివక్షతకు వ్యతిరేకంగా ఉంటూ, ూ+దీుQ ల హక్కులకు మద్దతుగా నిలుస్తుంది. అందరి సమానత్వం కోసం ఉన్న ఈ హక్కులు, హిందూ జాతీయవాద రాజకీయాల్లో ముఖ్య భాగం గా ఉన్న బ్రాహ్మణవాద విలువల్ని బంధిస్తాయి. దీనిని కొంతమేరకు సాధారణీకరణ చేయడానికి, మతం దుస్తుల్లో తమను తాము కవాతు చేయించే ఇలాంటి అన్ని రాజకీయ ధోరణులు, అంటే తాలి బాన్లు, ముస్లిం బ్రదర్‌ హుడ్‌, శ్రీలంక, మయన్మార్‌లలో బౌద్ధ మతం పేరుతో చేసే రాజకీయాలు, క్రైస్తవ ఛాందసవాదాలు అసమాన త్వాన్ని ప్రోత్సాహిస్తాయి. స్థానిక పరిస్థితులపై ఆధారపడి వారు భిన్నమైన వ్యక్తీకరణలు కలిగి ఉంటారు. మరోవిధంగా హిందూ జాతీయవాద భావజాల స్థాపకులు, మనుస్మతి దళితులు, మహిళల్ని లొంగదీసుకుంటుందనే కారణంగా దానిని స్తుతించారు. ఆరెస్సెస్‌ కూడా క్రైస్తవులను, ముస్లింలను విదేశీయులుగానే పరిగణిస్తుంది.1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు ‘రహస్యంగా మద్ధతు పలికిందన్న’ ఆరోపణలు కూడా ఆరెస్సెస్‌పై ఉన్నాయి.
సమాజంలో అనేక సామాజిక ఉద్యమాల ప్రయాణ లక్ష్యంగా ఉన్న సమానత్వ విలువల కోసం ఎదురుచూసే వోకిజం (మేల్కొలుపు)ను మితవాద రాజకీయాలు చెడుగా పరిగణిస్తాయి. అందుకే ప్రజాస్వామ్యం అనేది అణగారిన వర్గాల ఉద్యమాల కోరికగా ఉంటుంది. దళిత, మహిళా, ూ+దీుQ ల ఉద్యమాలను భారతదేశంలో హిందూ జాతీయవాదులు చిన్నచూపు చూస్తుంటే,
ఛాందసవాద శక్తులు పాలించే (ముస్లింలు మెజారిటీ)గా ఉండే దేశాల్లో మహిళలే ప్రధాన లక్ష్యాలుగా ఉన్నారు.
ఆరెస్సెస్‌, సమానత్వ విలువలను ‘ప్రాచీన స్వర్ణ కాలం’ విలువలు అంటే అసమానత్వ విలువలతో భర్తీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అణగారిన వర్గాల వారి హక్కులను ముందుకు తీసుకొనిపోయే ఉద్యమాలు, భావాలకు అది వోకిజం అనే పదాన్ని ఉపయోగిస్తుంది. ఆరెస్సెస్‌, బీజేపీ మధ్య ఉన్న అంతర్గత కలహాలు వారి కుటుంబ సమస్య. ఆ రెండింటి ప్రాథమిక విలువలు ఒకే విధమైనవి, (అవి ‘అహంభావ సమస్యలైనప్పటికీ’). మిగతా విషయాల్లో బీజేపీ ఏమిచేస్తే భగవత్‌ దానినే మళ్లీ చెబుతాడు. ఆయన బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాలను విమర్శిస్తాడు. ‘ఈ కారణంగా నేడు పంజాబ్‌, జమ్మూ-కాశ్మీర్‌, దేశానికి వాయువ్య సరిహద్దులోని లడఖ్‌, సముద్ర సరిహద్దులో కేరళ, తమిళనాడు, బీహార్‌ నుండి మణిపూర్‌ వరకు ఉన్న పూర్వాంచల్‌ మొత్తం కలత చెందిందని’ ఆయన అన్నాడు.ఆయన లడఖ్‌,మణిపూర్‌లను ఒకే కేటగిరీలో చేర్చినపుడే అసలు రహస్యం బయటపడింది.
కూకీలకు ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకంగా జరిగిన దారుణమైన హింసను మణిపూర్‌ చూసింది. బీజేపీ ప్రభుత్వం నిరాసక్తత మరింత కలవర పెడుతోంది. లడఖ్‌ కు సంబంధించినంతవరకు, పర్యావరణ పరిరక్షణ కోసం, సమానమైన పౌరసత్వం కోసం జరిగిన ఉద్యమాలను మనం చూశాం. అవి పోరాటాలు చేయడానికి తగిన కారణాలే. ఈ పోరాటం ఎంత శాంతియుతంగా జరిగింది! బ్రహ్మాండమైన సోనం వాంగ్‌చుక్‌ నాయకత్వాన్ని సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. ఆరెస్సెస్‌ ముద్దుబిడ్డ బీజేపీ లడఖ్‌ ఉద్యమాన్ని ఎలా విస్మరించిందన్న విషయం భారతదేశ సమకాలీన చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.
కోల్‌కత్తాలో ఆర్‌.జీ.కర్‌ మెడికల్‌ కళాశాలలో జరిగిన విషాదంపై భగవత్‌ ప్రస్తావించాడు, కానీ హర్యానాలో మహిళా మల్ల యోధులకు వ్యతిరేకంగా జరిగిన దారుణ కత్యాలు, దళిత బాలికలపై పెరుగుతున్న అకత్యాలపై నోరు మెదపకుండా మౌనం వహించి తన పక్షపాత ధోరణిని ప్రదర్శించాడు. ఈ పెద్దమనిషి ఒకసారి, ‘అత్యాచారాలు ఇండియా (పట్టణాల్లో)లో జరుగుతాయి, భారత్‌లో జరగవు’ అని ప్రకటించాడు. కానీ ఆయన చెప్పిన దానికి భిన్నంగా అలాంటి చాలా కేసులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని గ్రామాల్లో లేదా చిన్న పట్టణాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ‘సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌’ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక నివేదిక, దళితులకు వ్యతిరేకంగా 2022 లో జరిగిన దారుణ కత్యాలకు సంబంధించి ‘ఉత్తరప్రదేశ్‌లో 12,287 కేసులు, ఆ తరువాత రాజస్థాన్‌లో 8,651 కేసులు, మధ్యప్రదేశ్‌లో 7,732 కేసులు నమోదయ్యాయని తెలిపింది. బలహీనులు తమను తాము రక్షించుకోలేరు కాబట్టి హిందువులంతా ఐక్యంగా ఉండాలనే మాట భగవత్‌ ప్రసంగంలో రత్నం లాంటిది. భారతీయులంగా మనమంతా ఐక్యంగా లేమా? భారత రాజ్యాంగం ప్రకారం, భారతీయులంగా ఐక్యంగా ఉండడంలో ఏదైనా సమస్య ఉందా? అయితే భగవత్‌ నుండి వేరే విధంగా ఆశించడం అనేది తర్కవిరుద్ధం. ఎందుకంటే వారు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నారు.
(”న్యూస్‌ క్లిక్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
రామ్‌ పునియాని