
– హనుమకొండ డిపో నుండి ఉదయం 6 గంటల నుండి ఆర్టీసీ బస్సులు ప్రారంభం
– టీ జి ఎస్ ఆర్ టి సి రీజినల్ మేనేజర్ విజయబాను
నవతెలంగాణ -తాడ్వాయి
రెండేళ్లకోసారి నాలుగు రోజులపాటు నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అనంతరం, మధ్యలో ఒక సంవత్సరం మినీ జాతర (మండ మెలిగే) ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 12 నుండి 15 వరకు మినీ జాతర మహా వైభవంగా జరగనుంది. భక్తుల ప్రయాణికుల సౌకర్యార్థం ఇందుకు, టి జి ఎస్ ఆర్ టి సి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మినీ జాతరకు ప్రత్యేకంగా 100 బస్సులు ఏర్పాటు చేసినట్లు టీజీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాను పేర్కొన్నారు. 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు, హనుమకొండ బస్టాండ్ నుండి ఉదయం 6 గంటల నుండి ప్రారంభం మై మేడారం బయలుదేరినట్లు తెలిపారు. మినీ మేడారం జాతర కు కూడా సందర్శకులు అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా, మేడారం రద్దిగా మారుతుంది. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని బంగారాన్ని కానుక సమర్పించి ముక్కులు చెల్లించుకుంటారు. మినీ మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ ఈనెల ఫిబ్రవరి 19 తేదీ నుండి, 16 వ తేదీ వరకు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు హన్మకొండ బస్టాండ్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి మేడారం చేరుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సురక్షితమైన ఆర్టీసీ బస్సు ద్వారానే ప్రయాణించాలని తెలిపారు. ఆర్టీసీ బస్సులు గద్దెల వద్దకు చేరుకుంటాయని, నుండి తిరుగు ప్రయాణం జరుగుతుందన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ భాను తెలిపారు.
కాగా అలాగే కన్నాయిగూడెం మండలం లోని ఐలాపూర్ లో జరిగే మినీ మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సులు నడపనునట్లు ఆయన తెలిపారు.
మేడారం నుండి వయా ఊరటం, కొండాయి, చిన్నబోయినపల్లి ఐలాపూర్ మినీ జాతరకు మూడు బస్సులు నడపలున్నట్లు తెలిపారు. ఈ ఆర్టీసీ సౌకర్యాన్ని కోరారు.