పార్టీ సభలకు ఆర్టీసీ బస్సులు, ప్రజలకు ఇబ్బందులు

నవతెలంగాణ- రామారెడ్డి:  రాజకీయ పార్టీలు తమ సభలు సమావేశాలకు ఆర్టీసీ బస్సులతో జన సమీకరణ చేయడానికి బస్సులను వాడడంతో ప్రజలకు, విద్యార్థులకు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పోసానిపేట సర్పంచ్ గీ రెడ్డి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ ప్రజల రవాణా సౌకర్యార్థం ఏర్పాటు చేసిందని, ఏ రాజకీయ పార్టీలైన ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఆర్టీసీని వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీకి, ప్రభుత్వానికి సూచించారు.