నవతెలంగాణ – మాక్లూర్ : ఆలూరు మండలంలోని కల్లేడ గ్రామానికి చెందిన ఈరవత్రి శ్రీనివాస్ (36) ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన నిజామాబాద్ లోని నందేవ్ వాడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని కల్లేడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ వృత్తి రీత్యా ఆర్టీసి కండక్టర్ కావడంతో నిజామాబాద్ లోని నాందేవ్ వాడలో రూమ్ తీసుకొని ఉద్యోగం నిర్వహిస్తున్నారని, కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, ఓ కూతురు ఉన్నారని, బార్య, అమ్మానాన్న ఉన్నారు. మృతుడు సూసైడ్ నోట్ వ్రాసి చనిపోయినట్లు తెలిపారు.