నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రూప్ 4 ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం హుస్నాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సిహెచ్ వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. హుస్నాబాద్ లో జులై 1న గ్రూప్ 4 ఎగ్జామ్ రాసేందుకు వచ్చే 2154 అభ్యర్థుల కోసం రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం నుండి కరీంనగర్ హుస్నాబాద్ కు 4 ప్రత్యేక బస్సులు, హుజురాబాద్ టు హుస్నాబాద్ కు 2 ప్రత్యేక బస్సులు, జనగాం నుండి హుస్నాబాద్ కు బస్సులు నడుస్తాయన్నారు.గ్రూప్ 4 అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఎగ్జామ్ నందు సత్ఫలితాలు పొందాలని కోరారు