ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య– అధికారుల వేధింపులే కారణమని లేఖ
– వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో ఘటన
నవతెలంగాణ-తాండూరు
తాండూరు ఆర్టీసీ డిపోలో ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఓ డ్రైవర్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం దౌలాపూర్‌ గ్రామంలో మంగళవారం జరిగింది. దౌలాపూర్‌ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ రాజప్ప(47) కొన్ని రోజులుగా డిపోలో బస్సులకు డీజిల్‌ వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అతన్ని ఆ పనుల నుంచి తప్పించారు. దాంతో రాజప్ప తీవ్ర మనస్తాపానికి గురై తన స్వగ్రామంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించగా, తాండూరు ఆర్టీసీ డిపోలో ఉన్నతాధికారులు డీఎం, ఎంఎఫ్‌ జరనప్ప, సిద్దులు తన చావుకు కారణమని రాజప్ప లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తాండూర్‌ ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులు పెరిగాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.