నవతెలంగాణ-కల్లూరు
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాలు ప్రకారం.. వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాసరావు(45) గురువారం ఉదయం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవింగ్ చేస్తున్నారు. బస్సు సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తుండగా ఆయనకు గుండె నొప్పి వస్తుందని కల్లూరు పాత బస్టాండ్ వద్ద ఆపాడు. వెంటనే నడుచుకుంటూ స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో మృతి చెందాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.