– జరగకుండా జాగ్రత్తలు పాటించాలి
– షాద్ నగర్ ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్
నవతెలంగాణ-షాద్నగర్
ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని షాద్ నగర్ ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం షాద్నగర్ బస్ డిపోలో ప్రమాద రహిత వారోత్సవాలు డిపో మేనేజర్ ఉష అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్ని మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డ్రైవర్లు ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఐ అర్జున్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ఎం అలీ, ఆర్టీసీ సూపర్వైజర్లు, గ్యారేజీ సూపర్వైర్లు, డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.