– టీజీఎస్ ఆర్టీసీ ఆర్‌ఎం.కవిత రూపాల
– కూకట్‌పల్లిలో పలు బస్సు స్టాప్‌ల పరిశీలన
నవతెలంగాణ-కూకట్‌పల్లి
పాఠశాలలు, కళాశాలలు, పునఃప్రారంభం కావడం వల్ల, రద్దీ సమయాల్లో, క్రష్ రోడ్లు పెరిగే దష్ట్యా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ప్రయాణికులు ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు, మహిళా ప్రయాణికులు బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు భద్రతా నియమాలను పాటించాలని కూకట్ పల్లి డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కవిత రుపాల తెలిపారు. భద్రతా నియమాలను పాటించాలి. టిజీఎస్ ఆర్‌టీసీతో తమ ప్రయాణాన్ని నమ్మకమైన, సురక్షితమైన యాత్రగా మార్చుకోవాలన్నారు. కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని పలు బస్టాప్‌లో ఆమె పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంతో పాటుగా కూకట్‌పల్లి డిపో మేనేజర్ ఇసాక్ పాల్గొన్నారు. టీజీఎస్ ఆర్‌టీసీ సికింద్రాబాద్ రీజియన్‌లో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ముఖ్యమైన బస్టాప్‌లో, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ల టీమ్‌ని మోహరించారు. బస్ స్టాప్‌లో బస్సులు ప్రవేశించి, వెళ్ళిపోయే వరకు, డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తనను పర్యవేక్షించడానికి. ఎస్‌డీఐల బందం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా దిగడం, ఎక్కించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని రీజినల్ మేనేజర్ తెలిపారు. అంతే కాకుండా ప్రయాణికులందరూ సురక్షితంగా ఎక్కినట్టు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే బస్సును తరలించాలని, ప్రయాణీకులు ఫుట్ బోర్డు ప్రయాణంలో ఎవరూ లేరని నిర్ధారించుకోవాలని డ్రైవర్లకు సూచించారు. బస్టాపుల్లో అన్ని బస్సులు ఆగుతున్నాయని, ఏ బస్సు కూడా స్టేజీని దాటలేదని ఎస్‌డీఐ నిర్ధారిస్తారని, ప్రారంభంలో బోయిన్ పల్లి, బాలానగర్, గండి మైసమ్మ రూట్లలో సెకండ షిఫ్ట్‌లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు చెప్పారు. అలాగే వివిధ రూట్లలో ఒక వారం రోజుల పాటు, ప్రతిరోజూ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొ న్నారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం వలన రద్దీ సమయాల్లో, క్రష్ లోడ్లు పెరిగే దష్ట్యా పైన పేర్కొన్న ప్రత్యేక డ్రైవ్ చేపట్టబడిందని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ప్రయాణికులు ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు, మహిళా ప్రయాణికులు బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు భద్రతా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రయాణీకులు కొన్ని భద్రతా చర్యలను గమనించాలని పలు రీజనల్ మేనేజర్ కవిత రూపాల సూచించారు.
1, బస్ స్టాప్‌లో మాత్రమే నిలబడి బస్సులో సీటు పొందే ప్రయత్నంలో కదులుతున్న బస్సులో ఎక్కేందుకు ప్రయత్నించే, బస్టాప్ ముందు, మలుపుల వద్ద నిలబడకుండా ఉండాలన్నారు. ఇది ప్రయాణీకులకు చాలా ప్రమాదకరం అని, బస్ స్టాప్ లేదా బస్ బేలో ప్రయత్నించడం డ్రైవ్ చేయడానికి కూడా ఆటంకం కలిగిస్తుంది. 2. బస్సు బస్ బే లేదా బస్ స్టాప్ లోకి ప్రవేశించే వరకు ఆగాలి. 3. బస్ స్టాప్‌లోకి ప్రవేశించి బస్సును ఆపడానికి డ్రైవర్‌కు సమయం ఇవ్వండి. 4. బస్సు దిగే ప్రయాణీకులకు దారి ఇవ్వాలని దిగేవారు దిగిన తర్వాత మాత్రమే ఎక్కేవారు ఎక్కాలి. 5. ఇప్పటికే పూర్తి స్టాండింగ్ కెపాసిటీతో నడుపుతున్న బస్సులో మెట్ల వరకు ఎక్కకూడదని అంటే ఫుట్ బోర్డ్ ప్రయాణాన్ని నివారించాలి. 6. కదులుతున్న బస్సు ఎక్కే ప్రయత్నం అలాగే నడుస్తున్న లేదా కదిలే బస్సు నుంచి దిగొద్దు 7. దిగే ముందు బస్సు పూర్తిగా ఆగిన తరువాత దిగాలి. 8. ప్రయాణీకులు దిగే ముందు బస్సు కదిలి ఉంటే కండక్టర్ లేదా డ్రైవర్‌ను బస్సును ఆపాలని కోరి బస్సు ఆగిన తర్వాత మాత్రమే దిగాలి. 9. సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడం కోసం బస్సులోని డ్రైవర్లు, కండక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.