
మున్సిపల్ పట్టణ కేంద్రం ఆర్టీసీ డిపో ప్రక్కన జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేసేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గురువారం టీఎస్ ఆర్టీసీ అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో గురువారం మాల్ యందు అద్దె నిర్వాహకులు మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినారు. గత చేయాలని నెలరోజుల కిందటే లీజు దారుడు విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు మాల్ లీజు డబ్బులను చెల్లించాలని ఆర్టీసీ అధికారులు నోటీసులను అందజేశారు. అద్దె బకాయిలు చెల్లించాలని లీజు దారునికి నోటీస్ ఇచ్చిన స్పందించక పోవడంతో హైదరాబాద్ ఆర్టీసీ ఉన్నతాధి అధికారుల ఆదేశాల హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టీసీ అధికారులు, మాల్ లో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న దుకాణ దారులకు ఆర్టీసీ అధికారులు మాల్ ను సీజ్ చేస్తామని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి మాల్ లోని దుకాణా దారులకు చెప్పారు. ఆర్టీసీ సంస్థకు లీజు దారుడు 3 కోట్ల 14 లక్షల బకాయి ఉన్నట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. ఆర్టీసీ మాల్ ను సీజ్ చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టీసీ ప్రత్యేక అధికారులతో ఆర్టీసీ డిప్యూటీ ఆర్ ఎం శంకర్, ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు, డిపో సూపర్వైజర్ పారు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీకి లీజు దారుడు బకాయి ఉన్న బకాయిలు చెల్లించడానికి దుకాణ యజమానుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు సాయంత్రం వరకు గడువు ఇస్తూ నోటీసును మాల్ లోని దుకాణా దారులకు ఆర్టీసీ అధికారులు గురువారం అందజేశారు. ఆర్మూర్ ఆర్టీసీ స్థలాన్ని లీజు తీసుకొని మాల్ ను నిర్మించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆర్టీసీ అధికారుల మాల్ సీజ్ ఘటనపై పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏ విధంగా స్పందిస్తారని ప్రాంత ప్రజలు చర్చించు కుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి లీజుకు తీసుకొని నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసు అందజేసి ఆర్టీసీ ఉన్నతాధికారులు సీజ్ చేసేందుకు సిద్ధం కాగా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది.