
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ – 2 ఆర్టీసీ డిపోలో అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ సుచరిత మాట్లాడుతూ “ప్రతి ఉద్యోగి ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ పద్ధతిలో ఒక మొక్క నాటి, దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.తద్వారా పర్యావరణ పరిరక్షణకు మనం దోహదం చేయగలమని తెలిపారు.ఈ కార్య క్రమం లో డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) కె. సత్యనారాయణ, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్)భూపతి రెడ్డి, డిపో మేనేజర్ వి. మల్లయ్య ,సూపర్వైజర్లు తిరుపతి, విజయలక్ష్మి, వీరయ్య, నరహరి, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.