ఆర్టీసీ సంస్థ ఆదాయ పెంపులో భాగస్వాములు కావాలి

RTC should be involved in revenue generation– ఉత్తమ ఉద్యోగులకు సన్మానం
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆర్టీసి సంస్థ పురోగతిలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ప్రతి ఉద్యోగి సంస్థను తన స్వంత ఆస్తిగా భావిస్తూ చిత్తశుద్దితో పనిచేసి సంస్థ ఆదాయ పెంపులో భాగస్వాములు కావాలని ఆర్టీసి ఆర్ఎం సోలోమన్ అన్నారు. గడిచిన మూడు నెలల కాలంలో ఉత్తమ సేవలు అందించి సంస్థ ఆదాయం పెంపునకు కృషిచేసిన పలువురు డ్రైవర్లు, ఉద్యోగులను సన్మానించారు. శుక్రవారం స్థానిక డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని ఆరు డిపోలకు చెందిన ఉత్తమ ఉద్యోగులను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆర్టీసి ఆర్ఎం సోలోమన్ మాట్లాడుతూ ఉద్యోగులు విధినిర్వాహణతో పాటు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ద చూపాలన్నారు. నిస్వార్ధ సేవలతో సంస్థ పురోభివృద్ధికి భాగస్వామ్యం అందిస్తున్న ఉద్యోగులను అభినందించారు. ఉద్యోగుల సమిష్టి కృషి వల్లే గతం కన్నా సంస్థ ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. డ్రైవర్లు, సిబ్బంది విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రమాద రహిత, జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దాలన్నారు. మహిళా ప్రయాణీలకు పట్ల మర్యాదపూర్వకంగా మెదలాలని సూచించారు. కార్యక్రమంలో డిపోల మేనేజర్లు కల్పన, జనార్దన్, విశ్వనాధ్, హరిప్రసాద్, పిఓ గిబా, ఎఓ శంకరయ్య, సూపరిండెంట్ శివదాస్, పోతారెడ్డి పాల్గొన్నారు.