మృతుని కుటుంబానికి ఆర్టీఐ నాయకుల పరామర్శ


నవతెలంగాణ మల్హర్ రావు: మండలంలోని కొండంపేట గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు ఏనుగు నాగరాని లక్ష్మి నారాయణ తండ్రి ఏనుగు కిష్టయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆర్టీఐ కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు చొప్పరి రాజయ్య బుధవారం పరామర్శించి, ఓదార్చారు. మృతుకి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.