– ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్డీవో
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నియమకాలు అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ ఆర్డీవో గా విధులు నిర్వహించిన రమేష్ రాథోడ్ విధుల పట్ల నిర్లక్ష్యం అని, ప్రభుత్వ వాహనం స్వంతనికి వాడుకున్నారని, రేషన్ డీలర్ల నియామకంలో అక్రమాలు జరిగాయని, మంజీరా అక్రమ ఇసుక రవాణాపై ఆరోపణలు ఎదురుకున్న బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ ఎట్టకేలకు సిసిఎల్ కు అటాచ్ కావడంతో డివిజన్ ప్రజలు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా జరిగిన పట్టించుకోవడంలేదని, ఇసుక క్వారీ నిర్వాహకులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఫిర్యాదులు చేసిన పట్టించుకో లేదంటూ ఆరోపణలు, ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ వాహనం ను నిత్యం తన సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ ఉంది, ప్రభుత్వ వాహనం కామారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లా నిజామాబాద్ కు వెళ్లి వస్తుండేదని, ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ కొందరు ఆరోపించారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో తనకు నచ్చిన వారికి పట్టాలిచ్చారంటూ కొందరు నిర్భాగంగా ప్రచారం చేశారు, గత రెండు వారాల క్రితం బాన్సువాడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో రేషన్ డీలర్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయి అంటూ నిరసనలు ధర్నాలు చేశారు. బాన్సువాడ డివిజన్ లో ఎందరు మంది ఆడియోలు విధులు నిర్వహించినప్పటికీ ఇంతగా ఎవరిపై ఆరోపణలు రాలేదని కొందరు అధికారులు తెలపగా. పాలన విభాగంలో ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయని, బాన్సువాడ ఆర్ డి ఓ గారు సమయస్ఫూర్తితో అందరికీ న్యాయం జరిగేలా పాలన చేశారంటూ మరో అధికారి తెలిపారు.