
ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రత మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ అంతర్రాష్ట్ర ఆర్టీవో శాఖ ఇన్చార్జ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూ సుభాష్ ఆధ్వర్యంలో ధర్మారం టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం సగటున రోజుకు 20 మంది తమ ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుందని రోడ్డు భద్రత మాసొచ్చా వాలు ఈనెల ఒకటి నుండి ఈనెల 31 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మారం టోల్ ప్లాజా వద్ద వాహనాలకు స్టిక్కర్ల అతికించడం వాహనదారులకు అతివేగం గురించి, టూవీలర్ల వాహనదారులకు హెల్మెట్ ధరించడం గురించి, వాహనాలు నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడకూడదని అన్నారు. అదే విధంగా సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయకూడదని ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలకు డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజిని ఆర్టీవో శాఖ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు